రామగిరి,(విజయక్రాంతి): మండలంలోని బేగంపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ సమీపంలోని చేతి బోరు పంపు చెడిపోయియంది. ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ దృష్టికి తీసుకుపోవడంతో తక్షణమే స్పందించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. వెంటనే మెకానిక్ ను పిలిపించి బోరు పంపును మరమ్మతు చేయించి సమస్యని పరిష్కరించారు. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల సంజీవ్, రంగం సతీష్, అంకతి కుమార్, నాంపల్లి శ్రీనివాస్, ఊదరి గంగరాజు, ఊదరి రాయమల్లు, చిటికెల కుమార్ లు పాల్గొన్నారు.