calender_icon.png 14 October, 2024 | 10:54 AM

9/11 తరహా భారీ దాడికి హమాస్ కుట్ర

14-10-2024 03:36:32 AM

వాషింగ్టన్ పోస్ట్ కథనం 

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఇజ్రాయిల్‌పై 9/11 తరహా భారీ దాడికి హమాస్ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడికి ముందు ఈ మేరకు ప్లాన్ చేసిందని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డుల ను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి ఇజ్రాయెల్ దళాలు స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొంది.

రెండేళ్లుగా హమాస్ కీలక నేతలు జరిపిన సమావేశాల మినిట్స్‌లో ఈ ప్లాన్‌లు పొందుపరిచి ఉన్నా యి. హమాస్ నేత యాహ్యా సిన్వార్.. ఇరాన్ అధికారులతో చేసిన సంభాషణలను గుర్తించిన ఐడీఎఫ్ బలగాలు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలకు అందజేశాయి. తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక పది సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను ప్రచురించింది.

ఈ కథనాలల్లో సిన్వార్‌తో పాటు అతడి సోదరుడు, మహమ్మద్ డెయిఫ్, మార్వన్ ఇస్సా ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. 2021లో అల్ ఖమేనీ సహా ఇరాన్ కీలక నాయకులను సిన్వార్ కలిసినట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయంతో పాటు, సైనిక మద్దతు కూడా కోరినట్లు సమాచారం. ఖుద్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీతో కూడా సిన్వార్ సంప్ర దింపులు జరిపినట్లు తెలుస్తోంది.