calender_icon.png 31 October, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాస్ కమాండర్ డెయిఫ్ హతం

02-08-2024 01:35:08 AM

న్యూ ఢిల్లీ, ఆగస్టు 1: గాజాలోని హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు భారీ విజయం దక్కింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ సైనిక కమాండర్ మహ్మద్ డెయిఫ్‌ను.. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో జూలై 13న జరిపిన దాడుల్లో అంతమొందించినట్లు గురువారం టెల్ అవీవ్ అనే పత్రిక ప్రచురించింది. కాగా డెయిఫ్ దాడుల్లో పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకనేవాడని.. డెయిఫ్ లక్ష్యంగా ఇటీవల గాజాలో చేపట్టిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పయాడని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించాడు.

డెయిఫ్ అంటే అరబిక్ భాషలో ‘అతిథి’ అని అర్థం. 1980 చివర్లో డెయిఫ్ హమాస్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్ బాధ్యతలు చేపట్టాడు. గాజాలోని భూభాగంలో పెద్ద సంఖ్యలో వెలువడుత్ను టన్నెల్ నిర్మాణం వెనుక కూడా డెయిఫ్ మాస్టర్ మైండ్ ఉందని అప్పట్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దళాలు అతడిపై ఏడుసార్లు దాడులు చేయగా గాయాలపాలైనప్పటికీ ప్రతీసారి అతడు తప్పించుకునేవాడు.