calender_icon.png 24 September, 2024 | 3:02 AM

హమాస్ చీఫ్ హతం!

24-09-2024 12:57:57 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఇజ్రాయెల్ ఇటీవల హమాస్ సొరంగాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడుల్లో హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల రూపకర్త యాహ్యా సిన్వార్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. చాలాకాలం నుంచి అతడి కదలికలు లేకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు సైతం  సిన్వార్ మృతి చెందినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మాత్రం ఈ విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు. సిన్వార్ మృతికి సంబంధించి తమకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉన్నాడా అనేది అర్థం కావడం లేదని ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ విధమైన ప్రచారానికి తెరలేపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. గతేడాది డిసెంబర్‌లోనూ సిన్వార్ చనిపోయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అతడు ఉద్దేశపూర్వకంగానే తన కదలిక అనుచరులకు సైతం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.