ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ గోధుములలో పనిచేస్తున్న హమాలి రేట్లను ప్రభుత్వం జీవో ప్రకారం పెంచాల్సిందే అని ఏఐటియుసి(AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన హమాలి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ... ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలి రేట్ల పెంపు జరగాల్సి ఉందని ప్రభుత్వం ఇప్పటివరకు హమాలి చార్జీల విషయంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, 10 లక్షల బీమా, నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించి, ఇందిరమ్మ ఇల్లు, భూమిలేని నిరుపేదలకు మూడెకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సుధాకర్, శ్రీనివాస్, మోహన్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.