calender_icon.png 23 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సగం చెరువులు నిండలే

04-09-2024 01:16:36 AM

రాష్ట్రంలో మొత్తం చెరువులు 34,716.. అలుగుపారినవి 15,608 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఒక వైపు భారీ వర్షాలతో ఊర్లకు ఊర్లే మునిగిపోగా, మరికొన్ని చోట్ల సుక్కనీరు లేక చెరువులు నెర్రెలుబారాయి. నీటిపారుదల శాఖకు సంబంధించి 19 చీఫ్ ఇంజినీర్ల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 34,716 చెరువులు ఉన్నాయి. వీటిలో సోమవారం నాటికి 15,608 చెరువులు పూర్తిగా నిండాయి. 8,144 చెరువులు 75 నుంచి 100% వరకు నిండినట్లు అధికారులు తెలిపారు. 50నుంచి 75% మధ్య 5,012 చెరువులు, 25 నుంచి 50% మధ్య 3,745 చెరువులు, 25% వరకు 2,207 చెరువులు నిండినట్లు  అధికారులు వెల్లడించారు.