calender_icon.png 18 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరాహోరీగా గెలుపొందిన హాజిపూర్ తండా కబడ్డీ జట్టు

17-01-2025 08:25:51 PM

జనసంద్రంతో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్యే మదనన్న కబడ్డీ పోటీలు...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ అన్న కబడ్డీ పోటీలు(MLA Madan Anna Kabaddi Competitions) శుక్రవారం ముగిసాయి. ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి విజేతగా నిలిచి 51,000/- బహుమతిని గెలుపొందారు. రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (A) 21,000/-  బహుమతి గెలుపొందారు. మూడవ విజేతగా జాయింట్ విన్నర్ (భిక్కనూర్, మాచపూర్) 11,000/- బహుమతి గెలుచుకున్నారు. గత రెండు రోజులుగా హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడలు శుక్రవారం రాత్రి వరకు కోనసాగాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ(Former Municipal Chairman Kudumula Satyanarayana) ఈ క్రీడలకు స్పాన్సర్ గా వ్యవహరించారు. క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేసినందుకు సత్యనారాయణ క్రీడాకారులను అభినందించారు. ఎమ్మెల్యే మదనన్న పేరు మీద నిర్వహించిన కబడ్డీ క్రీడలకు 56 జట్లు కబడ్డీ క్రీడల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మా రెడ్డి రజిత, వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సామెల్, కాంగ్రెస్ మండల నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.