చలికాలంలో చాలామందిని జుట్టు సమస్య వేధిస్తుంటుంది. ముఖ్యంగా చల్లటి వాతావరణానికి జట్టులోని తేమ పోవడం, జుట్టు పాలిపోవడం, చుండ్రు సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. అయితే ఈ చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. వేడినీళ్లతో తల స్నానం చేయడం జుట్టుకు చాలా ప్రమాదకరం.
వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమ మొత్తం పోయి నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అయితే ఈకాలంలో గోరువెచ్చని లేదా, చల్లని నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు రాలకుండా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళి జుట్టులోకి చేరి అనేక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను చెక్ పెట్టేందుకు స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోవడం మంచిది.
చలికాలంలో జుట్టుకు మసాజ్ చాలా ముఖ్యం. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడడం వల్ల జుట్టు మూలాలు బలపడి పెరుగుదల చాలా సులభంగా ఉంటుంది. ఈ కాలంలో హెయిర్ డ్రయర్ లాంటివి వాడొద్దని చెబుతున్నారు నిపుణులు. చలికాలమే కదా అని చాలామంది తలకు నూనె పెట్టుకోరు. దాని వల్ల చర్మ కుదుళ్లు బలహీనంగా మారుతాయి. కాబట్టి అప్పుడప్పుడు నూనె తలకు పట్టించడం మంచిది.