calender_icon.png 16 March, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసాజ్‌తో జుట్టు ఒత్తుగా..

16-03-2025 12:51:17 AM

ఒత్తున, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అయితే చా లామంది జుట్టు పెరుగుదల, రక్షణ కోసం ఖరీదైన హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇంట్లో దొరికివాటితోనే మసాజ్ చేసుకుంటే ఒత్తున జుట్టును సొంతం చేసుకోవచ్చు. 

తలకు బాదం, కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే.. జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. మసాజ్ కారణంగా రక్త ప్రసరణ సాఫీగా జరిగి కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. తరచుగా తలకు మర్దన చేయడం ద్వారా జుట్టు కూడా ఎదుగుతుంది. అప్పుడప్పుడు తలకు గోరువెచ్చని నూనెలో మసాజ్ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. 

చుండ్రు సమస్య ఉన్న వారు తరచూ మసాజ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య దూరమవుతూ ఉంటుంది. అలాగే శిరోజాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా కనిపిస్తాయి.