13-04-2025 06:15:04 PM
చిల్పూర్,(విజయ క్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల వీచడంతో చెట్లు కూలిపోయాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి, మామిడి కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మండలంలోని పలు గ్రామాలలో ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సానికి పొట్టకొచ్చిన వరి చేన్లు దెబ్బతిన్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.