calender_icon.png 28 September, 2024 | 8:50 AM

హైలారేహైలా ఇయ్యాల.. ఆయుధపూజలు సెయ్యాల

27-09-2024 12:17:45 AM

టాలీవుడ్ ప్రస్తుతం ‘దేవర’ మేనియాతో ఊగిపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే, గురువారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ప్రత్యేక షోలతో సందడి మొదలైంది. ఇదిలా ఉండగా, మూవీ రిలీజ్‌కు మరికొద్ది గంటలే ఉందనగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘ఆయుధపూజ’ సాంగ్ ప్రోమో వీడియోను, ఆడియో రూపంలో పూర్తి పాటను విడుదల చేశారు. అంతకుముందే రామజోగయ్య శాస్త్రి ఈ గీత సాహిత్యాన్ని సోషల్ మీడియాలో వదిలారు. ‘ఎర్రటి సంద్రం ఎగిసిపడే.. అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు.. రణధీరుల పండగ నేడు’ అన్న పల్లవితో ఈ పాట ప్రారంభమైంది. ‘హైలారేహైలా ఇయ్యాల.. ఆయుధపూజలు సెయ్యాల..’ వంటి పంక్తులు ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ సంగీతం, కాలభైరవ గాత్రం అద్భుతంగా ఉన్నాయి.