calender_icon.png 27 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయహో నారీశక్తి

27-01-2025 01:07:16 AM

  1. కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర దినోత్సవం
  2. జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  3. వేడుకలకు హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో
  4. ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈసారి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతితో కలిసి ప్రబోవో ప్రత్యేక గుర్రపు బండిలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు సహా సుమారు 10వేల మంది అతిథులు పాల్గొన్నారు.

దేశ చరిత్రలో తొలిసారిగా..

ఈసారి గణతంత్ర వేడుకల్లో వికసిత్ భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో పరేడ్ నిర్వహించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారులు లెఫ్టెనెంట్ కల్నల్ రవీందర్‌జీత్ రందావా, లెఫ్టెనెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లుటై లెప్టెనెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లాలు నారీ శక్తికి ప్రాతినిధ్యం వహించారు.

డీఆర్‌డీఓ నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. అలాగే అసిస్టెంట్ కమాడెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల బృందం, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో పాల్గొన్నాయి. 

అలరించిన శకటాలు

రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి వేడుకల్లో పాల్గొ న్న శకటాలను ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్‌తో రూపొం దించా రు. వేడుకల్లో మొత్తం 31 శకటాలు పాల్గొన్నాయి. ఇందులో 16 శకటాల ను కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు రూపొందించా యి.

మరో 15 శకటాలను కేంద్ర మంత్రిత్వశాఖలు రూపొందించాయి. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ థీమ్‌తో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం చూపరులను ఆకట్టుకుంది. 

మరిన్ని విశేషాలు

* 300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని వాయించారు. అనంతరం గగనతలం నుంచి హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. 

* ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. 190 మంది సభ్యులతో కూడిన బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది. 

* 61 మందితో కూడిన అశ్విక దళం కవాతు నిర్వహించింది. దీనికి లెఫ్టెనెంట్ అహాన్ కుమార్ నాయకత్వం వహించారు. 

* దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 5వేల మంది కళాకారులు ‘జయతి జయ మహాభారతం’పాటకు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. 

* 22ఫైటర్ జెట్‌లు, 11 ట్రాన్స్‌పర్ట్ ఎయిర్‌క్రాప్ట్‌లు, ఏడు హెలికాప్టర్‌ల వైమానిక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

జనవరి 26: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రా జ్యాంగాన్ని రూపొంది ంచి.. ప్రజాస్వా మ్యం, గౌరవంతోపాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ ఈసందర్భంగా నివాళి అర్పిస్తున్నా..” అని కొనియాడారు.

గణతంత్ర వేడుక మన రాజ్యాంగ విలువను కాపాడుతుందని, బలమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశ ప్రజలకు గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పా రు.

“ గణతంత్ర దినోత్సవం అనేది భార త రాజ్యాంగ విలువలపై విశ్వాసం, సా మాజిక సమానత్వం, ప్రజాస్వామ్యంపై అంకితభా వానికి చిహ్నమని, ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు, రా జ్యాంగ నిర్మాతలకు ఘన నివాళి..” అని పేర్కొన్నారు. 

ఆకట్టుకున్న ప్రధాని తలపాగా!

దేశ రాజధానిలో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎరుపు, పసుపు కలగలి సిన వర్ణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ప్రధాని ఆయన ‘సఫా’ను ధరించారు.

ప్రతీ ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమైన తలపాగాలు ధరిస్తారనే విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సం దర్భంగా దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనుకులకు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. 

కోల్‌కతా పరేడ్‌లో రోబో డాగ్స్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రోబో డాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంజయ్‌గా నామకరణం చేసిన మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్(ఎంయూఎల్‌ఈ) రోబోటిక్ శునకాలు పరేడ్‌లో పాల్గొని చూపరులను ఆకట్టుకున్నాయి.