calender_icon.png 29 March, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్తాలలో వడగళ్ల వర్షం

23-03-2025 12:00:00 AM

కడ్తాల్, మార్చి 22 (విజయ క్రాంతి) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మం డల కేంద్రంలో  ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం శనివారం సాయంత్రం  కురిసింది. ఉదయం నుంచి ఎండా వేడిమితో అల్లాడుతున్న జనానికి సాయంత్రానికి భారీ వర్షం, వడగళ్ల వాన కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వడగళ్ల వర్షానికి పలు చోట్ల పంటలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్  జాతీయ రహదారి కడ్తాల్ పట్టణంలో భారీగా వడగళ్ళు కురవడంతో జనం బయాందోళనకు గురైయ్యారు.