calender_icon.png 22 March, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీభత్సం సూచించిన వడగళ్ల వాన

21-03-2025 10:31:16 PM

అకాల వర్షానికి నేలరాలిన వరి గింజలు

దండేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో పాటు పలు గ్రామాలలో కురిసిన అకాల వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు యాబై గ్రాముల స్థాయిలో రాళ్లు పడడంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేల రాలిపోయింది. వందల ఎకరాల వరి, మక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.