calender_icon.png 16 January, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్‌తో మజా వచ్చింది

09-08-2024 12:05:00 AM

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబో మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్. ఈ చిత్రం ఇదే నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ‘బిగ్ బుల్’ అనే ప్రత్యేక గీతాన్ని ముంబయిలో ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లో సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాలో డైనమిక్స్‌ను తీర్చిదిద్దారు పూరి జగన్నాథ్.

ఈ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసిన ఆయనకు థ్యాంక్స్. ఛార్మి పరేషాన్ చేసింది (నవ్వుతూ) తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రోడక్ట్ అంతా అద్భుతంగా వచ్చింది. రామ్ నా యంగర్ బ్రదర్ లాంటివాడు. తనతో పని చేయడం చాలా మజా వచ్చింది. డబుల్ ఇస్మార్ట్‌గా మస్త్ ఉంటాడు’ అని తెలిపారు. హీరో రామ్ మాట్లాడుతూ.. “డబుల్ ఇస్మార్ట్’తో నార్త్ ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.

సినిమాను దాదాపు ముంబైలో షూట్ చేశాం. సంజయ్ దత్ ఇందులో హైలెట్. ఈ క్యారెక్టర్‌ను ఆయన తప్ప మరొకరు చేయలేరు” అన్నారు. ‘నేను సంజయ్ బాబాకి బిగ్ ఫ్యాన్‌ని. మేము కలిసినప్పుడు ఆయన ఏడు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. డేట్స్ లేవని చాలా వర్రీ అయ్యాం. ఫైనల్‌గా ఆయన డేట్స్ దొరికాయి’ అని డైరెక్టర్ పూరి చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడి, తమ అభిప్రాయాలు తెలిపారు.