calender_icon.png 20 January, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ టీచర్‌పై క్రష్ ఉండేది

20-01-2025 12:26:43 AM

టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి జోరు కొనసాగుతోంది. వరుస అవకాశాలు పొందటమే కాదు, విజయాలనూ తన ఖాతాలో వేసుకుంటోందీ భామ. నిరుడు ఏకంగా అర డజను సినిమాల్లో నటించింది. మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’లో స్క్రీన్ పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దుల్కర్ సల్మాన్‌తో జతకట్టిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం హిట్ టాక్ అందుకుంది.

వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో సందడి చేసిన బ్యూటీ తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’లో తన అందచందాలతో అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టీమ్‌తో కలిసి పాల్గొన్న మీనాక్షి తన క్రష్ ఎవరో తెలిపింది.

‘మనందరికీ స్కూల్ లేదా కాలేజ్ టైమ్‌లో క్రష్ ఉంటుంది.. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకూ అలా అనిపిస్తుంది. నాకు కూడా నా స్కూల్ టైమ్‌లో నేను తొమ్మిదో తరగతి చదుతున్నప్పుడు ఒక టీచర్ మీద క్రష్ ఉండేది. అతడంటే చాలా ఇష్టం. హీరోలందరితో నటించాలనుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో యూనిక్ స్టుల్ ఉంటుంది. ముందుగా ప్రభాస్, పవన్‌కళ్యాణ్‌లతో నటించాలనుంది. పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఆయన బిజీ. ఒకవేళ ఛాన్స్ వస్తే వదులుకోను’ అని చెప్పింది మీనాక్షి.