మేడ్చల్, జనవరి 31(విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో శుక్రవారం 36 గంటల హ్యాకథాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 20 రాష్ట్రాలకు చెందిన 110 మంది టీంలు, 550 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ వీఏ నారాయణ, ప్రిన్సిపాల్ శేషుకుమార్, కో ఆర్డినేటర్ సురేశ్ రాం మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కళాశాలలో హ్యాకథాన్ నిర్వహించామన్నారు. ఈ సారి నిర్వహించిన హ్యాకథాన్ మంచి స్పందన వచ్చిందన్నారు. 1500 టీంలు దరఖాస్తు చేసుకోగా 110 టీంలను ఎంపిక చేశామని తెలిపారు
పరిశ్రమల నుంచి ఐదుగురిని, విద్యా సంస్థల నుంచి ఐదుగురిని న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించామని చెప్పారు. విజేత జట్టుకు 1.5 లక్షల నగదు బహుమతిని కూడా అందజేయనున్నామని తెలిపారు.