calender_icon.png 5 December, 2024 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గైనకాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయాలి

18-09-2024 06:50:06 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న నాలుగు గైనకాలజిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. సోమగాని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలందరూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వస్తారని, కేవలం ముగ్గురు గైనకాలజిస్ట్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని, వీరికి 24 గంటల డ్యూటీ వల్ల  గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు సరైన వైద్యం చేయడంలో ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కావున మరో నలుగురు గైనకాలజిస్ట్ లను త్వరలో నియమించి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళాకారుడు బాదే నరసయ్య, హైకోర్ట్ అడ్వకేట్ ఇస్లావత్ బాలాజీ నాయక్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.