14-02-2025 11:32:01 PM
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ)గా త్వరలో జ్ఞానేశ్‌కుమార్ బాధ్యతలు తీసుకోన్నునట్లు సమాచారం. ఈయన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలోని సహకార మంత్రిత్వశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖల కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త సీఈసీ ఎవరనే అంశం తెరమీదకు వచ్చింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు.