calender_icon.png 23 February, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్

18-02-2025 12:38:27 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారత ఎన్నికల 26వ ప్రధాన కమిషనర్ గా కేరళ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా నూతన ఎలక్షన్‌ కమిషనర్‌గా 1989వ ఐఏఎస్ బ్యాచ్ అధికారి వివేక్ జోషి నియామితులయ్యారు. ప్రస్తుతం ఆయన హర్యాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయడంతో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

కేరళ క్యాడర్‌కు చెందిన ‌జ్ఞానేశ్‌ కుమార్‌ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు, 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో (కశ్మీర్‌ డివిజన్‌) సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. జ్ఞానేశ్‌ ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు. హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్‌ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు.  ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా  ఆయన పర్యవేక్షణలోనే 2027లో జరుగుతాయి.