calender_icon.png 22 October, 2024 | 2:59 PM

దివాలా పరిష్కార ప్రక్రియలోకి జీవీకే పవర్

17-07-2024 06:56:58 AM

హైదారాబాద్, జూలై 16: బ్యాంక్ రుణాల్ని చెల్లించకపోవడంతో జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జీవీకేపీఐఎల్)ను దివాలా చట్టం మేరకు జరిగే పరిష్కార ప్రక్రియలోకి తీసుకువస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ వేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు జారీ అయినట్టు జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల తవ్వకానికి జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) పీటీఈ తీసుకున్న రుణాలకు జీవీకే పవర్ గ్యారంటీగా ఉన్నది. 2022 జూన్ 13నాటికి జీవీకే కోల్ డెవలపర్స్ అసలు, వడ్డీ, ఫీజులతో కలిపి 1.84 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15,500 కోట్లు) చెల్లించాల్సి ఉన్నదని ఎన్సీఎల్టీ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జీవీకేపీఐఎల్‌పై దివాలా ప్రక్రియకు మద్దతుగా గతంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ పిటిషన్‌పై లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది.