calender_icon.png 16 November, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా జీవీరెడ్డి

10-11-2024 01:44:28 AM

  1. నైతిక విలువల సలహాదారుగా చాగంటి
  2. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర
  3. రెండో లిస్ట్ విడుదల చేసిన కూటమి

  4. అమరావతి, నవంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తూ రెండో విడతలో నామినేటెడ్ పదవులను ఎన్డీయే కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంతకుముందే మొదటివిడతలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు, వివిధ కమ్యూనిటీ వర్గాల వెల్ఫేర్ సంస్థలకు చైర్మన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా 59 మందికి వివిధ రకాల నామినేటెడ్ పదవులను కట్టబెటింది. 

  5. ఈ క్రమంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్‌గా జీవీ రెడ్డి( టీడీపీ, మార్కాపురం)ని, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు( ఎథిక్స్ అండ్ వాల్యూస్)గా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును  నియమిస్తూ క్యాబినెట్ హోదా ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏపీ కల్చర్‌ల్ మిషన్ చైర్మన్‌గా తేజస్వీని, ఫారస్ట్ డెవలప్‌మెంట్  చైర్మన్ గా సుజయకృష్ణ రంగారావు( బొబ్బలి, టీడీపీ)ను, గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా జి. కోటేశ్వర్‌రావు(నరసరావుపేట, టీడీపీ)ను, స్వచ్ఛ ఏపీ మిషన్ చైర్మన్‌గా పట్టాభిరాంను నియమిచింది.

  6. మాదిగ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ, టీడీపీ), కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం, జనసేన), మట్టా ప్రసాద్(బీజేపీ)ను మచిలీపట్నం అర్బన్ డెవలంప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి చెందిన వ్యక్తులకు అధిక ప్రాధాన్యం లభించింది.