calender_icon.png 2 October, 2024 | 10:04 AM

ఆంధ్రాలో గుత్తేదార్ల గోస

02-10-2024 01:27:55 AM

హైదరాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు లు, మౌలిక వసతుల నిర్మాణాల పరిస్థితి రెడ్డొచ్చె మొదలాయె.. అన్న చందంగా తయారైంది. వీరు మీ పార్టీ కాంట్రాక్టర్లు, వారు మా పార్టీ కాంట్రాక్టర్లు అని వేరుచేసి వ్యతిరేక పక్షంలోని గుత్తేదార్లకు కాంట్రాక్టులే ఇవ్వకపోవటం, ఇచ్చినా బిల్లులు ఇవ్వకపోవటం.. చివరకు మధ్యలోనే కాంట్రాక్టులను రద్దుచేయటం సర్వ సాధారమైంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాం ధ్ర ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొన్ని ప్రాజెక్టులు చేపట్టి గుత్తేదార్లకు కాంట్రాక్టులు ఇచ్చారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగా నే వాటిని పక్కడ పెట్టేసి కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వైసీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను అటకెక్కించే పని మొదలుపెట్టారు.

ఖజానాను చూసుకోకుండా ప్రాజె క్టులు చేపట్టి కాంట్రాక్టులు ఇచ్చిన ప్రభుత్వా లు.. ఇప్పుడు తలకుమించిన భారం కావటంతో వాటిని మధ్యలోనే రద్దుచేస్తున్నాయి. మరి ఇంతకాలం పనిచేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటి? టెండర్లకోసం, మొబిలైజేషన్ కోసం, లేబర్ కోసం, మెషిన రీ కోసం ఇలా.. వారు ఇంతకాలం ఖర్చుచేసిన నిధులు ఎవరిస్తారు? వాటికి వడ్డీ ఎవరు కడుతారు? 

సర్కారు మారితే కాంట్రాక్టు రద్దేనా?

రాష్ట్రంలో పనులు ప్రారంభించి 25 శాతంకంటే తక్కువ పనులు చేసిన, అసలు పనులే మొదలుకాని కాంట్రాక్టులను రద్దుచేస్తున్నట్లు ఏపీ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ సెప్టెంబర్ 27న ప్రకటన విడుదల చేశారు. అలాంటి ప్రాజెక్టులు గుర్తించి వెంట నే కాంట్రాక్టులు రద్దుచేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ జారీచేశారు.

25 శాతం కంటే తక్కువ పను లు అయినవి, అసలు పనులే మొదలుకాని ప్రాజెక్టుల విలువ రూ.39 వేల కోట్లు అని, వాటిపై కోర్టు కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ని సడలించి చేపట్టిన ప్రాజెక్టులేనని తెలిపా రు. నిజానికి చంద్రబాబు మొదటిసారి వచ్చి న చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 30 కాంట్రాక్టులను వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ‘ప్రాధాన్యం లేని ప్రాజెక్టులు’ అన్న ముద్రవేసి రద్దుచేశారు.

వీరిలో చాలామంది టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. రద్దుచేసిన ప్రాజెక్టుల స్థానంలో వైసీపీ ప్రభు త్వం ‘అత్యవసరం’ అని పేరు చెప్పి ఖజానాలో నిధులు ఉన్నాయా? లేవా? అన్నది చూసుకోకుండా కాంట్రాక్టులు ఇచ్చేసింది.

ఐదేండ్ల తర్వాత ప్రభుత్వం మారితే?

టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన విధానం టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లకు కూడా నష్టం కలిగించేదు. వైసీపీ అధికారం లో ఉన్న ఐదేండ్లు బిల్లులకోసం ఎదురుచూసిన గుత్తేదారులు.. ప్రభుత్వం మారగానే ఇక అవి వస్తాయని ఆశపడ్డారు. కానీ, చంద్రబా బు ప్రభుత్వం 25 శాతం పనుల నియమం పెట్టి రద్దు అనగానే వారి ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వమే కాంట్రాక్టు ఇచ్చి.. ప్రభుత్వమే పనులు ఫలానా సమయం లోపు పూర్తవ్వాలని కండిషన్ పెట్టి..

ప్రభుత్వ మే నిధులివ్వకుండా, బిల్లులు విడుదల చేయకుండా ఆలస్యం చేసి.. చివరకు పనులు సమయానికి కాలేదు కాబట్టి వాటిని రద్దు రద్దు చేస్తున్నామని ప్రభుత్వమే ప్రకటిస్తున్నది. అన్ని తప్పులు ప్రభుత్వం చేస్తే శిక్ష కాంట్రాక్టర్లకు ఎందుకు పడాలి? మరో ఐదేం డ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే..

ఆ వచ్చే ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే.. ఏంటి పరిస్థితి? చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రావటంతోనే ‘రెడ్ డైరీ’ని ఓపెన్ చేసిం ది. గత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధించటమే లక్ష్యంగా ఈ డైరీని బయటకు తీశారు. 

ప్రభుత్వ విధానాలను అమలుచేయటమే అధికారి పని.. ఒకవేళ ముఖ్యమంత్రో, మంత్రో ఏదైనా పని చెప్తే ‘నేను చేయను’ అని ఒక ఐఏఎస్ అధికారో.. ఐపీఎస్ అధికా రో చెప్పగలడా? వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? ఇలా అధికారులను కూడా ఆ పార్టీకి అనుకూలం, ఈ పార్టీకి అనుకూలం అనుకొంటూ వేరుచేస్తూ పోతే.. వారు ధైర్యంగా పనిచేయలగరా?

రాష్ట్రం పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభు త్వం ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేస్తూ పోతే.. చివరకు పనులు చేయటానికి ఎవరైనా ముందుకొస్తారా? ప్రజలకు మేలు చేసే పనులు చేయటానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే ప్రభుత్వమే స్వయం గా ఆ పనులు చేయగలదా? ఇలాంటి విధానాల వల్ల చివరకు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన గాడి తప్పదా? రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదా? చేపట్టిన పనులకు సకాలంలో బిల్లులు ఇవ్వక ఉద్దేశపూర్వకం గా నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టం రాష్ట్రానికే కదా? ఏ కారణంతో ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తిచేయకపోయినా గుత్తేదార్లకు పెరిగిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. అది ఎవరికి నష్టం? ప్రాజెక్టుల పనులు మధ్యలో ఆగిపోయినా, కాంట్రాక్టులను మధ్యలో రద్దుచేసినా నష్టం రాష్ట్ర ఖజానాకే. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని వీరు రాజకీయ ప్రతీకార చర్యలతో మరిం త కష్టాల్లోకి నెడుతున్నారు.