calender_icon.png 24 December, 2024 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టలా..గన్ని సంచుల రాశులా?

24-12-2024 12:46:55 AM

కోనరావుపేట, డిసెంబర్ 23: ధాన్యం సెంటర్లలో కొనుగోల్లు ముగిసిన గన్ని సంచులను రాశులుగా వేసి నిర్లక్ష్యంగా పడేశారు. కోనరావుపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో  నిజామాబాద్ శివారులో ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోల్లు పూర్తున గన్ని సంచులు, వేయిం గ్ మిషన్‌లను సొసైటీకి తరలించడం లేదు.సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో రూ.లక్షల విలువ చేసే గోనె సంచులు చెదలు పట్టి మట్టిపాలవుతున్నాయి.

కొనుగోళ్ల సమయంలో రైతులకు సంచులు అందుబాటులోలేక అవస్థలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రూ. లక్షల విలువ చేసే సంచులను ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.