కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 4 (విజయక్రాంతి): జిల్లాలో గుట్టుగా నిషేధిత గుట్కా దందా నడుస్తున్నది. కాగజ్‌నగర్, ఆసిఫాబా ద్, కౌటాల ప్రాంతాలే అడ్డాగా వ్యాపారం విరాజిల్లుతున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిషేధిత గుట్కాను దిగుమతి చేసుకుని, అమ్ముతు న్నారు. కొందరు వ్యాపారు లు ముఠాగా ఏర్పడి దందా నడిపిస్తున్నారు. కొన్ని పాన్ షాపులు, దుకాణాల్లో బహిరంగంగానే విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు అడ పా దడపా దాడులు చేసి వదిలేస్తున్నారు. నిషేధిత గుట్కా తీసుకున్న యువత అనారోగ్యం బారిన పడుతున్నది.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సిర్పూర్(టి), కౌటాల మీదుగా కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌కు గుట్కా దిగుమతులు జరుగుతున్నాయి. లారీలు, ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాల్లో గుట్టు చప్పుడు తీసుకొస్తున్నారు. దిగుమతి గుట్కా, తంబాకు ప్యాకెట్లను ఇతర ప్రాంతాలకు తరలించి, యథేచ్చగా అమ్ముతున్నారు. విక్రయాలు జరుపుతున్న వారు గతంలో పోలీసులకు చిక్కినప్పటికీ దందా మానకపోవడం గమనార్హం. ఇటీవలే జిల్లా కేంద్రంలోని గుండి సమీపంలో రూ.8 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను పోలీసు లు పట్టుకున్నారు.
కాగజ్‌నగర్‌లో ఈ నెల 27న రూ.2 లక్షలకు పైగా నిషేధిత పాన్‌మ సాల ప్యాకెట్లను పట్టుకున్నారు. ఇంతలా పట్టుబడుతున్న దంటే గుట్కా వ్యాపారం ఏమేరకు సాగు తుందో ఆర్థం చేసుకోవచ్చు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. గుట్కా వ్యాపారులకు అడ్డుకట్ట పడక పోతే యువతతో పాటు గుట్కా అలవాటైన వారి జీవితాలు మరింత నాశనం అవుతాయి.
గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యం
జిల్లాలో గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. గుట్కా సరఫరాపై నిఘా ఉంచడంతో పాటు దాడులు కొనసాగిస్తున్నాం. గుట్కా నిల్వలు, అమ్మకాలు జరిగినట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి. ప్రజలు మాకు సహకరిస్తే పూర్తి స్థాయిలో గుట్కాను అరికడతాం.
బి డీవీ శ్రీనివాస్, ఎస్పీ, ఆసిఫాబాద్