ఆదిలాబాద్, (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఎన్ని దాడులు చేసిన అక్రమ గుట్కా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో భారీగా గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి ఆదిలాబాద్ లోని అస్లాం ట్రేడర్స్ కు వచ్చిన కంటైనర్ ను మావల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.