హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చేపట్టిన ఆర్. గురునాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడంతో అభిమానులు కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.