calender_icon.png 2 October, 2024 | 10:06 AM

గురుకులాలు మెరుగుపడాలి

02-10-2024 02:50:09 AM

బీసీ సంక్షేమ శాఖ కుటుంబం లాంటిది

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): గురుకులాల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశం లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

బీసీ సంక్షేమ శాఖలో సమస్యలను పరిష్కరించుకుందామని, అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఆదిలా బాద్ జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించడంలో విఫలమైన అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్టోబర్‌లో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్, నవంబర్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలు, డిసెంబర్‌లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కార్నివాల్ ఏర్పా టు చేసిన ట్టు తెలిపారు. సమావే శంలో బీసీ సంక్షే మశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాలామాయదేవి తదితరులు పాల్గొన్నారు. 

ఎంఎస్‌ఎంఈల్లో బీసీలకు సబ్సిడీలు ..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ బీసీలకు కూడా సబ్సడీలు ఇవ్వాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామికవేత్తలతో కలిసి మేధోమథన సదస్సు నిర్వహిం చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో బీసీలకు సబ్సిడీ, ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతాయని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ పాలసీలో చేర్చే ప్రాథమిక అంశాలపై బీసీ సంక్షేమ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.