calender_icon.png 23 February, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

23-02-2025 06:13:46 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గురుకుల ప్రవేశ పరీక్షకై ఎస్టి గురుకుల క్రీడా పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల నుంచి కేంద్రాలకు తరలివచ్చారు. వారికి ఉపాధ్యాయులు హాల్ టికెట్లు పరిశీలించిన అనంతరం కేంద్రాలకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద చేగుంట ఎస్సై శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.