22-02-2025 12:55:42 AM
జహీరాబాద్ ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం గురుకుల ప్రవేశ పరీక్షను ఈనెల 23న నిర్వహిస్తుందని రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సృజన తెలిపారు . ఐదవ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు . పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు పెన్ను పెన్సిల్ తీసుకొని ఉదయం 9 గంటలకు ప్రవేశ పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్నారు.