calender_icon.png 25 February, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన గురుకుల విద్యార్థులు

13-02-2025 02:09:48 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)కి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్--2025 సెషన్ 1 పరీక్షల్లో చక్కని విజయాలు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. ఎస్సీ గురుకులాల విద్యార్థి ఆర్ మణిదీప్ - 99.03తో అత్యుత్తమ పర్సంటైల్ స్కోర్ సాధించినట్లు ఆమె పేర్కొన్నారు.

కే చరణ్ తేజ్ - (98.30), డి. తేజస్విని (98.267), పీఏవీ శ్రీనివాస్- (96.88), జే రామ్‌చరణ్ తేజ- (96.78), ఎం భవ్యశ్రీ ( 95.75), పీ భానుతేజ - (95.49), వి సుజాత (95.49), కే చరణ్ తేజ్ (95.20), కే కీర్తన -(95.07) పర్సంటైల్ సాధించారని అన్నారు. మొత్తం 415 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత పొందినట్టు వివరించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.