calender_icon.png 6 March, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాల విద్యార్థి గల్లంతు...

06-03-2025 07:18:00 PM

14 రోజులైనా లభించని విద్యార్థి ఆచూకీ..

ఆందోళన చెందుతున్న విద్యార్థి తల్లిదండ్రులు..

పొంతన లేని సమాధానాలు చెబుతున్న ప్రిన్సిపల్..

విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు..

విద్యార్థి అదృశ్యంపై కొలిక్కిరాని విచారణ..

గురుకుల విద్యార్థి ఏమైనట్లు..?   

కామారెడ్డి/నిజాంసాగర్ (విజయక్రాంతి): గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమై 14 రోజులు అవుతున్న విద్యార్థి అచూకీ ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కామారెడ్డి జిల్లా మద్దునూరు మండలం పెద్దశక్కర్గా గ్రామానికి చెందిన రాజేందర్ కుమారుడు విద్యార్థి ఓంకార్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. గత 20 రోజుల క్రితం పాఠశాలల్లో లాప్టాప్ చోరీకి గురైంది. పదవ తరగతి చదువుతున్న ఓంకార్ ల్యాప్టాప్ ను చోరిచేశారని గురుకుల పాఠశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ జనార్ధన్ ఆరోపణలతో విద్యార్థి అదృశ్యమయ్యాడు. 14 రోజుల క్రితం గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జనార్ధన్ నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 14 రోజులు అవుతున్న విద్యార్థి ఓంకార్ అదృశ్యం కేసు విచారణ కొలిక్కి రాలేదు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి గత 14 రోజుల క్రితం అదృశ్యమైన ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థి అదృశ్యంపై వివరాలు సేకరించేందుకు వెళ్లిన విజయక్రాంతి ప్రతినిధితో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి అదృశ్యంపై పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొనడంతో పాటు తామేం చేస్తామని లాప్టాప్ చోరీ చేశారని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అడిగినందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పడం సమాధానం చెప్పకుండా ఇతర ఉపాధ్యాయులకు ఫోన్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థి ఓంకార్ ల్యాప్టాప్ చోరీ చేస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకపోవడం కేవలం విద్యార్థిపైనే ఒత్తిడి చేశామని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి విద్యాలయంలో లాప్టాప్ చోరీ చేశాడనే విద్యార్థిపై పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ అభియోగం మోపారు. సదరు విద్యార్థి ల్యాప్టాప్ తెచ్చిస్తానని గురుకుల విద్యాలయం నుండి వెళ్లి తిరిగి రాలేదని ఫిబ్రవరి 22వ తేదీన విద్యాలయ ఇంచార్డ్ ప్రిన్సిపాల్ జడ్డు జనార్దన్ నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు విద్యార్థి ఆచూకీ లభించ లేదు. ఈ విషయమై విద్యాలయ ప్రిన్సిపాల్ ను వివరణ కోరెందుకు ప్రయత్నించగా సదరు ప్రిన్సిపాల్ ఇతర ఉపాధ్యాయులకు ఫోన్ ఇచ్చి సమాచారం ఇచ్చేందుకు సహకరించడం లేదు.

ఇట్టి విషయమై నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ వివరణ కోరగా అచ్చంపేట గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థి అదృశ్య విషయమై తమకు ఫిర్యాదు అందిందని సదరు విద్యార్థి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కల్పించుకొని విద్యార్థి ఆచూకీ కనుగొనే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు ఎక్కడకి వెళ్ళాడో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమది పేద కుటుంబం అని తమ కుమారుని ఆచూకి కనుగొనాలని గురుకుల ఉపాధ్యాయుల పైనే తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విజయ క్రాంతి ప్రతినిధికి విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. గురుకుల పాఠశాల నుంచి పదవ తరగతి విద్యార్థి ఓంకార్ అదృశ్యమై 14 రోజులు అవుతున్న ఉన్నతాధికారులు కానీ స్థానిక అధికారులు కానీ పట్టిం చుకోవడం లేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎస్పీలు ప్రత్యేక చొరవ చూపి గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన ఓంకార్ అనే బాలుని ఆచూకీ కనుగొనాలని విద్యార్థి తల్లిదండ్రు లు కోరుతున్నారు. విద్యార్థి అదృశ్యమై 14 రోజులు గడుస్తున్న విద్యార్థి ఆచూకీ లభించడం లేదని అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడు ఎంతో సిన్సియర్ గా ఉండేవాడని అలాంటి తమ కుమారునిపై ల్యాప్టాప్ చోరి చేశారని అభియోగం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మోపుతున్నారని అలా చేస్తే తమను పిలిచి తమ కుమారునికి తమ ముందు కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది పోయి తమకు తెలియకుండానే తమ కుమారుని పై ఒత్తిడి తీసుకువచ్చి తమ కుమారుడు ఏ అఘాయిత్యానికి పాల్పడ్డాడు పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తమ కుమారుడు ఓంకార్ అదృశ్యం పై మిస్టరీని తేల్చాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.

14 రోజులుగా తమ కుమారుని కోసం వెతుకుతున్నామని ఆచూకీ లభించడం లేదని విజయ క్రాంతి ప్రతినిధితో విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శంకఅర్క కు చెందిన తమకు తమ కుమారుని ఆచూకీ లభించేలా ఉన్న తదికారులు కృషిచేసి తమ కుమారుని ఆచూకీ లభించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు విచారణను వేగవంతం చేయాలని విద్యార్థి ఓంకార్ తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి ఆవేదనను ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే.