calender_icon.png 24 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ప్రవేశ పరీక్షలు ప్రశాంతం

24-02-2025 12:22:40 AM

వనపర్తి, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి ) : గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కొరకు 5వ తరగతి విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పోటీ పరీక్షలు నిర్వహించారు.

వనపర్తి జిల్లాలో మొత్తం 5047 విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా (9) పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు.  ఈ రోజు జరిగిన పరీక్షకు 4904 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవ్వగా 143 మంది  గైరాజరు అయ్యారు.  97.17 శాతం విద్యార్థులు పరీక్షలు రాశారు.

జిల్లా కలెక్టర్ మర్రికుంట లోని గిరిజన గురుకుల పాఠశాల, బాగవరం తాండా వద్ద అనుస్ జూనియర్ కళాశాల ను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు.