calender_icon.png 29 April, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిష్కార్ సమ్మర్ క్యాంపు ప్రారంభించిన గురుదేవ్ విద్యాలయం

26-04-2025 12:00:00 AM

చర్ల, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని  గురుదేవ్ విద్యాలయం లో  ఆవిష్కార్ వేసవి శిక్షణా శిబిరం శుక్రవారం ప్రారంబిచారు . ఈ సందర్భంగా తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ట్రెజరర్,ఆర్చరీ మార్గదర్శకుడు పుట్టా శంకరయ్య  మాట్లాడుతూ వైజాగ్ లో అత్యవసర సమావేశం ఉన్నను ఆర్చరీ పట్ల మన గురుదేవ్ విద్యాలయంలో చూపిస్తున్న శ్రద్ధకు ప్రేరితులై  వచ్చానని  మారుమూల ప్రాంతాలలో రూట్స్ ఉంటాయని కానీ పట్టణాలలో వనరులు ఎక్కువగా ఉండటం వల్ల మారుమూల ప్రాంతాలలో వారు క్రీడలలో రాణించలేక పోతున్నారని నిరంతర కృషి వల్ల ఏదైనా సాధ్యమేనని ఫలితం తప్పక లభిస్తుందని తెలిపారు.

గురుదేవ్ విద్యాలయంలో ఈ క్రీడా స్ఫూర్తిని మూడు సంవత్సరాల పాటు కొనసాగించి 30 మందితో టీం ను తయారుచేయలని  అలా తయారుచేస్తే జాతీయస్థాయి క్రీడాకారులతో గురుదేవ్ స్కూల్ ని విజిట్ చేసేలా చేస్తానని తెలిపారు. . ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ వి.వి.ఎస్ మూర్తి  మాట్లాడుతూ గురుదేవ్ స్కూల్ కి  రావడం ఎంతో  సంతోషంగా ఉందని కేవలం చదువులు, ర్యాంకులు మాత్రమే చూస్తున్నటువంటి  ప్రస్తుత కార్పొరేట్ విద్యా వ్యవస్థలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా తీసుకున్న ఈ నిర్ణయం సమ్మర్ క్యాంప్ నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. 

ఈ పాఠశాల నుండి తప్పకుండా టేబుల్ టెన్నిస్ లో జాతీయస్థాయికి తీసుకు వెళ్లే లాగా క్రీడాకారులను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎం.వి సుబ్రహ్మణ్యం,జి.శ్రీనివాస్ , ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు క్రీడాకారులు  మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.