calender_icon.png 15 November, 2024 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోదరభావాన్ని పెంపొందించడమే గురునానక్ మార్గం

11-11-2024 12:00:00 AM

  1. గురునానక్ జయంతోత్సవాల్లో భాగంగా ప్రకాశ్ ఉత్సవ్ వేడుకలు 
  2. నగరంలో నేడు సిక్కుల నగర్ కీర్తన్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): సోదరభావాన్ని పెం పొందించడమే గురునానక్ చూపిన మార్గమని ప్రకాశ్ ఉత్సవ్ ప్రభందక్ కమిటీ అధ్యక్షుడు ఎస్ బల్దేవ్ సింగ్ బగ్గా, ఎస్ సత్వీందర్‌సింగ్ బగ్గా, ప్రధాన కార్యదర్శి ఎస్ జగ్‌మోహన్ సింగ్, సెక్రటరీ ఎస్ హర్‌ప్రీత్‌సింగ్ గులాటి తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న గురుద్వారాలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాల ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్ 555వ జయంతి సందర్భంగా నవంబర్ 11 నుంచి 15 వరకు నగరంలో ప్రకాశ్ ఉత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వేడుకల్లో భాగంగా నగరంలో నేడు సిక్కుల నగర్ కీర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం సాయం త్రం 4గంటల నుంచి సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ నుంచి మనోహర్ టాకీస్, క్లాక్‌టవర్, బాటా, ప్యాట్నీ సర్కిల్, కింగ్స్‌వే, మోండామార్కెట్, ఆల్ఫా హోటల్ మీదుగా యాత్ర నిర్వహించి గురుద్వారాకు చేరుకుంటామన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 15న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘విశాల్‌దీవన్’ పేరిట భారీ సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమానికి గోల్డెన్ టెంపుల్ దర్భార్ సాహెబ్ భాయ్ లక్విందర్ సింగ్‌జీ, భాయ్ అమర్‌జీత్ సింగ్‌జీ, భాయ్ జాగ్వేందర్ సహా ఇతర సిక్కుమత ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు.