calender_icon.png 15 January, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణమ్మ ఒడిలో గుర్రంగడ్డ కన్నీళ్లు

10-09-2024 01:16:32 AM

  1. ఏటా వానాకాలంలో 6 నెలల పాటు జలదిగ్బంధంలోనే గ్రామం 
  2. బ్రిడ్జి నిర్మాణానికి రాజకీయ గ్రహణం 
  3. నీటి బుడగల్లా సీఎంల హామీలు 
  4. ఏళ్లు గడుస్తున్నా పుట్టి ప్రయాణమే దిక్కు

గద్వాల(వనపర్తి), సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఏటా వానకాలంలో ఏదో ఒక చోట భారీ వర్షాలు కురిసి, వరదలతో కొన్ని రో జులపాటు ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కానీ గద్వాల జిల్లా గద్వాల మండలం గుర్రంగడ్డ గ్రామం మాత్రం ఏటా వా నాకాలంలో 6 నెలలపా టు జలదిగ్బంధంలోనే ఉంటుంది. ఈ గ్రామానికి కష్ణా నదిలో నుంచే తాత్కాలిక రోడ్డు ఉం టుంది. వానాకాలం లో నది ప్రవాహంలో ఆ రోడ్డు మునుగుతుంది. దీంతో దాదాపు ఆరు నెలలపాటు ఆ గ్రామ ప్రజలకు పుట్టి ప్రయాణమే దిక్కు. దీంతో ఆ ఆరు నెలలపాటు బాహ్య ప్రపంచంతో వారికి సంబంధం తెగినట్టుగా ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి లో దగ్గర్లోని పట్టణానికి వెళ్లాలంటే ప్రమాదకర స్థితిలో పుట్టి ప్రయాణం చేయాల్సిందే. గుర్రంగడ్డ గ్రా మం వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 35కి.మీ. లు, గద్వాల నుంచి 15కి.మీ.ల దూరంలో ఉంటుంది. 

ఎక్కువ ఖర్చు.. తక్కువ ఓట్లు 

నది ప్రవాహ సమయంలో ఆ గ్రామం చుట్టూ నది ప్రవహిస్తూ.. చిన్నపాటి దీవిలా దర్శనమిచ్చే గుర్రంగడ్డ గ్రామం 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉం టుంది. సుమారు 1,050 మంది ప్రజలు నివసిస్తుండగా ఓటు హక్కు ఉన్నవాళ్లు కేవలం 580 మంది మాత్ర మే. ఆ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం కోసం అ య్యే ఖర్చు మాత్రం రూ.9.9 కోట్ల నుంచి అంచనా వ్యయం రూ.12.37 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటు బ్యాంకు అంచనా వేసుకుని బ్రిడ్జి నిర్మాణానికి వెనుక అడుగులు వేస్తున్నా రు. గుర్రంగడ్డ గ్రామ పంచాయతీగా ఏర్పడి సుమారు 40 ఏండ్లు కావస్తున్నది. 

పిల్లర్లకే పరిమితమైన మాజీ సీఎం హామీ

2018లో అప్పటి సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణానికి రూ.9.9 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న మాజీ ఎంపీపీ మేఘా రెడ్డి కాంట్రాక్టర్ దక్కించుకున్నా డు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పిల్లర్లకే పరిమితం చేశారు. అనం తరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా నాటి కాం ట్రాక్టరే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఈ ప్రాంత బిడ్డ కావడంతో గుర్రంగడ్డ బ్రిడ్జి సమస్య తీరుతుందని గ్రామస్థులు కలలు కంటున్నారు. 

పంచాయతీ ఎన్నికల కోసం మరబోటు?

ఇటీవలే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరబోటును ప్రారంభించా రు. ఆ తర్వాత జడ్పీ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ గద్వాల ఇన్‌చార్జి సరిత పర్యటించారు. గుర్రంగడ్డ గ్రామస్థులకు శాశ్వత పరిష్కారాన్ని చూపకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాత్కాలిక ఉపశమనం కోసం మరబోటును ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

ఎన్నికలప్పుడే నేతల ప్రత్యక్షం

ఎన్నికల సమయంలోనే రాజకీయ నా యకులు వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం నుంచి సుమారు రెండు కి.మీ. మేర బ్రిడ్జి నిర్మాణం చేపడుతామంటూ హా మీలు ఇస్తూ వస్తున్నారు. కానీ నేటికీ ఆ గ్రా మం వర్షాకాలంలో దీన స్థితిలో బతుకీడుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పుట్టి ప్రయాణం చేయాల్సిన దుస్థితి. దీంతో కొంతమంది గ్రామాన్ని వీడి పట్టణాల్లో అద్దె ఇళ్లలో బతుకుతున్నారు. ఆ గ్రామంలోని విద్యార్థులు ఉనత్న చదువుల కోసం పుట్టి ప్రయాణం చేయలేక మధ్యలోనే మానేస్తున్నారు.