calender_icon.png 16 November, 2024 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెజిల్ విమానాశ్రయంలో సాయుధుల కాల్పులు

10-11-2024 01:30:01 AM

వ్యాపారవేత్త దారుణ హత్య

న్యూఢిల్లీ, నవంబర్ 9: బ్రెజిల్‌లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయుధులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యాపారవేత్త ప్రాణాలు విడిచారు. అధికారులు తెలిపిన ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన ఆంటోనియో వినిసియస్ లోపెస్ గ్రిట్జ్‌బాచ్ అనే వ్యాపారవేత్త గ్వారుల్ హౌస్‌లోని సావో పాలో అంతర్జాతీ య విమానాశ్రయంలోని టెర్మినల్ 2 బయట ఉన్నారు. అప్పుడే అక్కడే ఉన్న ఓ కారు నుంచి కొందరు సాయుధులు బయటకు వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. దాడిలో గ్రిట్జ్‌బాచ్ మృతిచెందగా, మరో ముగ్గు రు గాయపడ్డారు. కాగా సదరు వ్యాపారవేత్తకు ఫస్ట్ క్యాపిటల్ కమాండ్ (పీసీసీ) అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్రూప్ నుంచి చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్లు దర్యాప్తులో వెల్ల డైందని పోలీసులు తెలిపారు. గ్రిట్జ్‌బాచ్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.