calender_icon.png 8 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంజ వీర బ్రహ్మయ్య సేవలు మరువలేనివి

08-02-2025 01:35:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): హెలెన్ కెల్లర్స్ స్కూల్ విద్యార్థులకు ఆప్తుడు, శ్రేయోభిలాషి అయిన గుంజ వీర బ్రహ్మయ్య సేవలు వరువలేనివని హెలెన్ కెల్లర్స్ స్థాపకులు లయన్ పటాన్ ఉమర్ఖాన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 850 మంది విద్యార్థులు, 56 మంది ఉపాధ్యాయులు,  పది మంది లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ సభ్యులు వీరబ్రహ్మయ్యను స్మరించుకుంటూ మౌనం పాటించారు.

బ్రహ్మయ్య కుటుంబానికి భగవంతుడిని మనోస్థుర్యైన్ని అందించాలని  వేడుకున్నారు. లయన్ పటాన్ ఉమర్ఖాన్ పాల్గొన్నారు. తమ సొంత నివాసంలో ఆత్మీయులందరితో కర్మకాండ పెద్ద ఎత్తున జరిపించినట్లు వీరబ్రహ్మయ్య కుమారుడు వెంకట్రావు తెలిపారు.