calender_icon.png 2 February, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో కాల్పుల కలకలం

02-02-2025 01:13:07 AM

  • పాత నేరస్తుడిని పట్టుకొనేందుకు పోలీసుల యత్నం

గన్‌తో ఎదురుదాడికి దిగిన దుండగుడు

కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు గాయాలు

గచ్చిబౌలి ప్రీజమ్ పబ్‌లో ఘటన 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేపాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రీ జమ్ పబ్‌లో మోస్ట్ వాంటెడ్ దొంగ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు ఫైరింగ్ చేయడంతో కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు దొంగ ను అదుపులోకి తీసుకున్నారు.

గాయపడిన కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌ను చికిత్స కోసం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిల కడగా ఉన్నట్టు తెలిసింది. పబ్‌లో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో అక్కడ ఉన్న వారం తా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గచ్చి బౌలిలో కాల్పుల ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.