calender_icon.png 16 March, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ఎన్నిక

16-03-2025 06:35:59 PM

పిట్లం (విజయక్రాంతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (పిఆర్టియుటిఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పిట్లం మండల పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షుడు పి. బన్సీలాల్, ప్రధాన కార్యదర్శి సి. నారాయణతో పాటు ఉపాధ్యాయులు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు శాలువాతో సన్మానం చేసి సత్కరించారు. గుండు లక్ష్మణ్ ఎన్నిక మారుమూల ప్రాంతాల ఉపాధ్యాయులకు గౌరవాన్ని తీసుకువచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.