27 May, 2026 | 5:24 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ఉత్తమ ప్రధానాచార్యుగా గుండేటి కోటేశ్వరరావుకు సన్మానం

27-05-2026 03:27 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 27, 28 తేదీలలో నిర్వహిస్తున్న వర్షారంభ సమావేశాల్లో భాగంగా 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానాచార్యులను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్‌కు చెందిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావును ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తక్కళ్ళపల్లి తిరుపతిరావు, ప్రాంత కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు, లింగం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.