calender_icon.png 23 February, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండాల తహసీల్దార్ ధరణి ఆపరేటర్ సస్పెండ్

22-02-2025 12:59:59 AM

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 21 ( విజయ క్రాంతి ) :అసలు  పట్టాదారుని వారసులకు తెలియకుండా  అధికారులకు లంచాలు ఇచ్చి భూమిని తన పేరు మీద చేసుకుని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్న వ్యక్తిపై  చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ. ధరణి ఆపరేటర్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ భూభాగోతం గుండాల మండలం తహసిల్దార్ కార్యాలయ అధికారుల కనుసైగల్లో జరిగింది.

గుండాల గ్రామ పరిధిలోని 177/1 177/2 సర్వే నెంబర్లలోని 09.17 గుంటల భూమి పట్టాదారుడైన యూసుఫ్ వద్దిన్ తండ్రి ఒలి మహమ్మద్ పేరు మీద ఉన్నది. ఇతను చనిపోయాడు. అతని వారసులకు తెలియకుండా గుండాల తాసిల్దార్ కార్యాలయ అధికారులకు ముడుపులు అందజేసి నల్లగొండ పట్టణానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం  ఆధార్ కార్డులో తన పేరు తండ్రి పేరు మార్పింగ్ చేసుకున్నాడు.

అదే గ్రామానికి చెందిన మాదర బోయిన నరసింహ శ్రీమతి మంద మహేశ్వరి లకు అమ్మాడని వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ హనుమంతరావు విచారణ జరిపి ధరణి ఆపరేటర్ ఎన్ రాజును విధుల నుండి తొలగించారు. పాస్ పుస్తకాల్లో పేర్లు మార్పించి అమ్మిన సయ్యద్ ఇబ్రహీం, మాదరబోయిన నరసింహ శ్రీమతి మంది మహేశ్వరి లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ సంఘటనలో మరింత లోతుగా  విచారణ జరిపి బాధ్యులైన ఇతర అధికారులపై చర్యలు