calender_icon.png 23 October, 2024 | 2:24 AM

గుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేత

22-07-2024 11:24:51 AM

పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్

పెద్దపల్లి, (విజయక్రాంతి) : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని సబ్బితం, గట్టుసింగారం, గౌరిగుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జీ కృష్ణ యాదవ్ తెలిపారు. సబ్బితం  గ్రామంలో జలపాతం వెళ్లే దారిలో ఏసీపీ బారీకేడ్ లు, హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దారిని మూసివేశారు. పరిసరాలను పరిశీలించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న దృష్ట్యావాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిందని, దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. జలపాతం వెళ్లే దారిలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటుచేసినట్లు, సందర్శనకు వచ్చేవారికి గ్రామస్థులు సైతం అవగాహన కల్పించి, తిరిగి పంపించాలని సూచించారు. ఏసీపీ వెంట పెద్దపల్లి సీఐ కృష్ణ, ఎస్ఐ లు లక్ష్మణరావు, స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.