‘ఫ్రాడ్ ఐఏఎస్’ అంటూ పూజ మీద విరుచుకుపడుతున్న నెటిజన్లు
తుపాకీతో రైతులను బెదిరించిన పూజ తల్లి మనోరమ
పుణె, జూలై 20: వివాదాస్పద ట్రైయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తల్లి నుంచి పుణె పోలీసులు తుపాకీని రికవరీ చేసుకున్నారు. ఆమె తుపాకీతో కొంత మంది రైతులను బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలకు దిగారు. ఈ కేసులో మనోరమ భర్త, పూజ తండ్రి ది లీప్ ఖేద్కర్‌కు జూలై 25 వరకు కోర్టు మధ్య ంతర బెయిల్ మంజూరు చేసింది. హత్యాయత్నం, బెదిరింపులు, ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మ నోరమ, దిలీప్‌తో పాటు మొత్తం ఐదుగురి మీద కేసు నమోదైంది. పూజ తల్లిని శని వారం పోలీసులు కోర్టులో హాజరుపరి చా రు. మనోరమ ఇంటి నుంచి తుపాకీని స్వాధీ నం చేసుకున్నట్లు పుణె రూరల్ పోలీస్ సూ పరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. తుపాకీతో పాటు మూడు లైవ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.