- ప్రజాభవన్‌లో తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్
- వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు సర్కార్ యోచన
- గల్ఫ్ కార్మిక సంఘాల
ప్రతినిధుల వెల్లడిజగిత్యాల, ఆగస్టు 4 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17లోగా తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపినట్టు గల్ఫ్ కార్మిక సంఘా ల ప్రతినిధులు దొనికెని కృష్ణ, మంద భీంరె డ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీ ఎం వినోద్‌కుమార్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో వారు మీడియాతో మాట్లాడా రు.
ఈనెల ౨న సీఎం రేవంత్‌రెడ్డిని, సీఎంవోలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసే సీని యర్ ఐఏఎస్ అధికారి వీ శేషాద్రిని అసెంబ్లీలో కలిశామని తెలిపారు. సెప్టెంబర్ 17లో గా హైదరాబాద్ ప్రజాభవన్ ఆవరణలో తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేసేలా ప్రభు తం యోచిస్తోందని 2024 ఏప్రిల్ 16న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు.
విదేశాలకు వలస వెళ్లిన కార్మికుల సం క్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే విషయాన్ని తమ ప్రభుతం అధ్యయనం చేస్తోందని సీఎం తాజాగా చెప్పారని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ వీ శేషాద్రి మార్గ దరనంలో కేరళ, ఫిలిప్పీన్స్ అమలు చేస్తు న్న ప్రవాస విధానాల అధ్యయనం చేసి పాలసీ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్టు సీఎం చెప్పారని వెల్లడించారు.