calender_icon.png 11 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు పెట్టాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ

02-08-2024 12:39:14 AM

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, వారి సంక్షేమ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎమ్మెల్సీలు ఎల్ రమణ, గోరటి వెంకన్న సూచించారు. విదేశీ ద్రవ్యంతో దేశానికి, రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందుతున్నారని, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని పేర్కొన్నారు. విదేశాల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నవారి మృతదేహాలు కూడా సకాలంలో స్వస్థలాలకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న మాట్లాడుతూ.. నిత్యవసర సరుకుల కల్తీ అవుతున్నాయని, వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని సూచించారు. నూనెలు, పసుపు, కారం వంటి అనేక వస్తువులు పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి వస్తున్నాయని, వాటిపై అధికారులు నిఘా పెట్టాలని పేర్కొన్నారు.