calender_icon.png 27 October, 2024 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల్లో గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలి

18-09-2024 12:00:00 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ 

హైదరాబాద్, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎంకు మంగళవారం లేఖరాశారు. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు గల్ఫ్‌లో ఉపాధి పొందతున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యమివ్వాలన్నారు. తెలంగాణ నుంచి ౧౫ లక్షలకు పైగా ప్రజలు  గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని తెలిపారు.

స్థానికంగా ఉపాధి లభించక కుటుంబాలకు దూరంగా బతుకుదెరువుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఓవైపు కుటుంబాలకు దూరం కావడం, మరోవైపు అనారోగ్యాలు, ప్రమాదాలకు గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితు ల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఒక్కో కార్మికుడు నెలకు రూ.10 వేల చొప్పు న పొదుపు చేసినా.. 15 లక్షల మంది నెలకు రూ.1,500 కోట్ల మేర స్వదేశానికి సమకూర్చుతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో కనీసం రూ.లక్ష 80 వేల కోట్లు విదేశీ మారకద్రవ్యం సమకూరిందని చెప్పారు. ఇంత సంపద సమకూర్చినా గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డలకు ఒక్క రూపాయి లాభం జగరకపోవడం దురదృష్టకరమని అన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం కేరళ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినట్టే.. తెలంగాణలోనూ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.