calender_icon.png 24 January, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుకేశ్ విజయం

24-01-2025 01:16:39 AM

ఆమ్‌స్టర్‌డామ్: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో మరో విజయంతో మెరిశాడు. గురువా రం జరిగిన ఐదో రౌండ్‌లో గుకేశ్ జర్మనీకి చెందిన విన్సెంట్ కేమర్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో 3.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుకేశ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 

మిగిలిన మ్యాచ్‌ల్లో ఆర్.ప్రజ్ఞానంద, గుకేశ్, హరిక్రిష్ణ  తమ మ్యాచ్‌లు డ్రాగా ముగించుకున్నారు. చాలెంజర్స్ విభాగంలో ఆర్.వైశాలీ డ్రా చేసుకోగా.. మరో గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ మాత్రం బెంజమిన్ బోక్ చేతిలో ఓట మి పాలైంది. ఇక తాజాగా విడుదల చేసిన ఫిడే ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2784 పాయింట్లు సాధించి అర్జున్ రికార్డును బ్రేక్ చేశాడు. అర్జున్ తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన ఆటగాడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు.