న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాడు. ఈ సంద ర్భంగా చెస్ చాంపియన్ ట్రోఫీ, చెస్ ఒలింపియాడ్ పతకాన్ని గుకేశ్ మో దీకి చూపించాడు. ‘ప్రపంచ చాంపియన్‌గా నిలిచి దేశానికి గర్వకారణ మైన గుకేశ్‌తో మీటింగ్ అద్భుతంగా జరిగింది. గుకేశ్‌కు ఆటపై ఉన్న నిబద్ధత, సాధించాలన్న తపన దగ్గరి నుంచి చూశాను. చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు మరోసారి అభినం దనలు’ అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.