ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ :
సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగిసింది. మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్ 23 ఎత్తుల వద్ద లిరెన్‌తో డ్రా చేసుకున్నాడు. తొలి గేమ్‌లో విజయం సాధించిన లిరెన్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నాడు. నేడు ఇద్దరి మధ్య మూడో రౌండ్ గేమ్ జరగనుంది.
మొత్తం 14 రౌండ్లు జరగనున్న టైటిల్ ఫైట్‌లో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలవనున్నాడు. ప్రస్తుతం లిరెన్ ఖాతాలో 1.5 పాయింట్లు ఉండగా.. గుకేశ్ 0.5 పాయింట్లతో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఐదుసార్లు నెగ్గి చరిత్ర సృష్టించాడు.